‘నా ఓపికను పరీక్షించొద్దు’.. సొంత మంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్

by Gantepaka Srikanth |

వరంగల్ కాంగ్రెస్‌(Warangal Congress)లో మరోసారి విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

‘నా ఓపికను పరీక్షించొద్దు’.. సొంత మంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కాంగ్రెస్‌(Warangal Congress)లో మరోసారి విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈసారి భద్రఖాళీ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు అంశంలో గొడవ మొదలైంది. మంత్రి కొండా సురేఖ(Konda Surekha), ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి(Naini Rajender Reddy)ల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దీంతో కొండా సురేఖ వ్యవహారంపై అధిష్టానానికి నాయిని రాజేందర్ కంప్లైంట్ చేశారు. తనకు తెలియకుండా, ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆలయ ధర్మకర్తలను నియమించారని ఆరోపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా ఓపికను పరీక్షించొద్దని మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే నాయిని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. నాయినిపై తీవ్ర విమర్శలు చేశారు. అదృష్టం కొద్దీ గెలిచి అతిగా మాట్లాడొద్దు అని హితవు పలికారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో అని ఇరు వర్గాల నేతలు ఆసక్తిగా చూస్తున్నారు.

Next Story