- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో హృదయాన్ని కదలించే ఘటన.. డైరెక్టర్ వేణు ఉడుగుల ఎమోషనల్
హైదరాబాద్‌లో హృదయాన్ని కదలించే ఘటన.. డైరెక్టర్ వేణు ఉడుగుల ఎమోషనల్

దిశ, వెబ్‌డెస్క్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య(Darshanam Mogilaiah) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లానాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి అందరి మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో మెట్రో పిల్లర్‌కు మొగులయ్య చిత్రాన్ని పెయింటింగ్ వేశారు. ఆ పెయింటింగ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. ఇది గమనించిన మొగులయ్య.. స్వయంగా తానే.. తన పెయింటింగ్‌పై అంటించిన పోస్టర్లను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల(Venu Udugula) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘‘పద్మశ్రీ పొందిన ముఖం కూడా మనలో కొందరికి ఖాళీ గోడలా కనిపిస్తే, ఇది అవమానం కాదు. మన సాంస్కృతిక స్పృహ ఎక్కడో బలహీనపడుతోందని చెప్పే నిశ్శబ్ద సంకేతం. మొగిలయ్య తన బొమ్మపై అంటించిన పోస్టర్లను తానే తొలగించుకుంటున్న ఆ సందర్భం చాలా విచారకరం. నిజానికి ఇది ఎవరి మీద ఆరోపణ కాదు. మనలోని నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సంఘటన’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్‌గా మారింది.






