- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమౌళి నిండు నూరేళ్ళు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలి: బండి సంజయ్
రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన SSMB 29 సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన SSMB 29 సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ రాజమౌళి (Director Rajamouli) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఈవెంట్ కు ముందు మహేష్ బాబుకు సంబంధించిన లుక్స్ ను భారీ స్క్రీన్ పై చెక్ చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ సహాయంతో వీడియో తీసి.. సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో తాము పడ్డ శ్రమ మొత్తం వృధా అయిందని, అందుకే తనకు దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదని ఈ సందర్భంగా రాజమౌళి చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ.. ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. "రాజమౌళి నిండు నూరేళ్ళు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నాను. దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి.. ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా అని ఈ సందర్భంగా బండి సంజయ్ సెటైర్లు వేశారు.






