- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad MLC: నామినేషన్లకు రేపే లాస్ట్ డేట్.. హైదరాబాద్ ఎమ్మెల్సీ పోటీపై పార్టీల డైలామా!
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad MLC Election-2025) ఎన్నిక ఆసక్తిగా మారింది. రేపేటితో నామినేషన్ల (Nominations) గడువు ముగియనుండగా పోటీ విషయంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. బలాబలాల దృష్ట్యా అంతిమంగా పోటీలో ఎవరెవరు ఉండబోతున్నారు? మద్ధతు విషయంలో ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు రాబోతున్నది అనేది చర్చగా మారింది. హైదరాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 110 మంది ఓటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు, బీఆర్ఎస్ కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్ కు 14 ఓట్లు ఉన్నాయి. దీంతో బలాబలాలను బట్టి ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో రాజకీయం నడిపించబోతున్నది అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
కాంగ్రెస్ వ్యూహం:
హైదరాబాద్ ఎమ్మెల్సీ విషయంలో అధికార కాంగ్రెస్(Congress), ఎంఐఎం (MIM) మధ్య చర్చలు తుదిదశకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సిట్టింగ్ స్థానం కావడంతో తమకు మద్దతు ఇవ్వాలని అలా చేస్తే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో సహకరిస్తామి కాంగ్రెస్ కు ఎంఐఎం ఆఫర్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నికలో తమకే మద్దతు ఇవ్వాలని హైదరాబాద్ మేయర్ పీఠం ఇచ్చేలా ఎంఐఎంను కాంగ్రెస్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలో ఎవరు డ్రాఫ్ అవుతారు ఎవరు పోటీలో నిలుస్తారనే ది ఉత్కంఠగా మారింది.
బీజేపీ పోటీపై ఉత్కంఠ:
హైదరాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి మజ్లీస్ ను అడ్డుకుంటామని ఇటీవల బీజేపీ (BJP) నేతలు చెప్పారు. ఈ ఎన్నిక విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల పార్టీ నేతలతో చర్చలు సైతం జరిపారు. ఈ క్రమంలో నామినేషన్ల గడువు ముంచుకు వస్తున్నా కమలం పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం ఇంకా వెల్లడికాకపోవడం కాషాయపార్టీ రేస్ లో ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
బీఆర్ఎస్ సైలెన్స్:
ఇటీవల జరిగిన రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ (BRS) పోటీకి దూరంగా ఉంది. ఓటమి పాలయై పరవు పోగొట్టుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయంతోనే బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందనే చర్చ జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచనే చేస్తుందా లేక పోటీకి దిగి చూపిస్తుందా ఇంకా తేలాల్సి ఉంది.






