- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఇక డిజిటల్ క్రాప్ సర్వే.. నకిలీ రైతుల ఆగడాలకు బ్రేక్!
సాగు చేయకుండానే ప్రభుత్వ లబ్ధి పొందుతున్న నకిలీ రైతుల ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పంటలు సాగు చేయకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న నకిలీ రైతుల కట్టడికి వ్యవసాయ శాఖ ప్లాన్ వేసింది. డిజిటల్ క్రాప్ సర్వేతో వారిని గుర్తించి అసలైన రైతులకు న్యాయం చేసేందుకు సిద్ధమైంది. ఈ సర్వేతో సాగు చేయకుండా పథకాలు పొందేవారి చిట్టా బయటపడుతోంది. వారంతా గత 10 ఏళ్లుగా రైతు బంధుతో పాటు, విపత్తులకు పంట నష్టం జరిగితే దర్జాగా పరిహారం ఖాతాలో వేసుకున్నారు.
సర్వేతో మంచి ఫలితాలు..
రాష్ట్రంలో నిజమైన రైతులకు ప్రభుత్వం అందించే ఏ పథకం పూర్తిగా అందడం లేదని భావించిన వ్యవసాయ శాఖ నిజమైన రైతులకు న్యాయం చేసేందుకు అనేక ప్రయోగాలు చేసింది. ఈ నేపథ్యంలో నిజంగా పంట సాగు చేసే రైతులను గుర్తించేందుకు వ్యవసాయ విస్తరణాధికారులతో పాటు, వారికి తోడు వాలంటీర్లను నియమించింది. వారు ప్రతి సర్వే నెంబర్‌కు వెళ్లి ఏ పంట సాగు చేశారో రైతు వివరాలను సేకరిస్తూ ఫొటోలు తీసి కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖకు వివరాలు పంపిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఎలాంటి సాగు చేయని పట్టాదారు పాసుబుక్కలిగిన రైతులు అనేక పథకాలు ఉచితంగా పొందినట్లు తేలింది.
సాగు చేస్తేనే కొనుగోలు చేసేలా..
ఇక నుంచి పత్తి, ధాన్యం కొనుగోళ్లలో పంటలు సాగు చేసే రైతుల నుంచి కొనేందుకు వ్యవసాయ శాఖ ప్లాన్ చేస్తున్నది. గతంలో దళారులు చిన్న, సన్నకారు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు దర్జాగా అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో పంట పండించే రైతు కంటే బ్రోకర్లు బాగుపడుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వారి అరాచకాలకు ముకుతాడు వేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పక్క రాష్ట్రాల నుంచి సన్నవడ్లు
రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సన్నాల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్ప్రకటించి కొనుగోలు చేస్తుండటంతో దళారులు దందాకు తెగబడ్డారు. పక్క రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి తక్కువ ధరకు సన్న వడ్లను కొనుగోలు చేసి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరిపినట్లు పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు అందాయి. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన సన్నాలు నాణ్యతగా లేవని సీఎంఆర్ చేసిన మిల్లర్లు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ శాఖ కొత్త మార్గాలు కనిపెట్టి సాగు చేసిన రైతులను గుర్తించి వారి పంట కొనుగోలు చేసేలా సర్వే చేపడుతుంది.






