- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Digest The Growth: కడుపు మండితే ఈనో తాగు కేటీఆర్.. ఎంపీ చామల హాట్ కామెంట్స్
సీఎం దావుస్ టూర్(CM Davos tour) గురించి బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కడుపు మండితే ఈనో తాగాలని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం దావుస్ టూర్(CM Davos tour) గురించి బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కడుపు మండితే ఈనో తాగాలని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్(R&B Guest House) లో తుంగతుర్తి ఎమ్మెల్యే(Thungathurthi MLA) మందుల సామేలు(Mandhula Samelu)తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ టూర్ వెళ్లి, భారత్ లో ఏ రాష్ట్రం తేని విధంగా మన తెలంగాణ కు అత్యధిక పెట్టుబడులు తెచ్చారని తెలిపారు.
గత సీఎంకి దావోస్ తెల్వదు.. సెక్రటరియేట్ తెల్వదు.. ఫామ్ హౌస్ మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. గత పాలకులు 9 సంవత్సరాలలో 25,750 వేల కోట్లు తెస్తే.. రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలోనే 1,78,950 వేల కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారని విమర్శలు చేశారు. దీనివల్ల సుమారుగా 50 వేల మందికి పైగా ఉపాధి పొందుతారని తెలియజేశారు. బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం, కడుపు మంటతో మేము చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కడుపు మండితే ఈనో(Eno) తాగు కేటీఆర్(ktr) అంటూ.. మీరు మీ కుటుంబ సభ్యులు ఈనో తాగండి అని సూచించారు. అంతేగాక మీ అందరికి ఈనో కోరియర్ పంపిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ చెప్పారు.






