తెలంగాణలో భిన్న వాతావరణం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి...

తెలంగాణలో భిన్న వాతావరణం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాలు(Cumulonimbus clouds) ఏర్పడ్డాయి. దీంతో ఉత్తర తెలంగాణ(North Telangana)లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ(Meteorology Department) అధికారులు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. గతేదాడి ఏప్రిల్‌తో పోలిస్తే 1 నుంచి 2 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చెప్పారు. శనివారం సైతం పలు జిల్లాల్లో తెలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దీనికి తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Next Story