నీకు ఎమ్మెల్సీ ఇప్పించింది ‘కాకా’ కాదా.. ప్రేమ్‌సాగర్ రావుకు వినోద్ కౌంటర్

by Shiva |
నీకు ఎమ్మెల్సీ ఇప్పించింది ‘కాకా’ కాదా.. ప్రేమ్‌సాగర్ రావుకు వినోద్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రివర్గ విస్తరణపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు (Prem Sagar Rao) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ (Congres Party)లో దుమారాన్ని రూపుతున్నాయి. సోమవారం ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. ఒకవేళ తనకు మంత్రి పదవి రాకపోతే సహించేది లేదన్నారు. పదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తమకిచ్చే గౌరవం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే.. తాము ఏమై పోవాలంటూ గడ్డం వివేక్ (Gaddam Vivek) కుటుంబాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ప్రేమ్‌సాగర్ రావు వ్యాఖ్యలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ (Gaddam Vinod) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత 70 ఏళ్ల నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీ (Congres Party)లోనే కొనసాగుతోందని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi)ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన ఘటన తమ తండ్రి వెంకటస్వామి (Venkata Swamy)దేనని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో ఉంటూ.. తాము చేసినంత అభివృద్ధి మరెవరూ చేయలేదని అన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్న ప్రేమ్‌సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పంచింది తన తండ్రి వెంకటస్వామి కాదా అని వినోద్ ప్రశ్నించారు.

Next Story

Most Viewed