కాలేశ్వరం విచారణపై కేసీఆర్ పక్కా ప్లాన్.. అందుకే తేదీ మార్చుకున్నారా..?

by Bhoopathi Nagaiah |

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

కాలేశ్వరం విచారణపై కేసీఆర్ పక్కా ప్లాన్.. అందుకే తేదీ మార్చుకున్నారా..?
X

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరుకావాల్సిన తేదీ మారింది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని, ఆ రోజుకు బదులుగా జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా కేసీఆర్ కమిషన్‌కు సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ అందుకు అంగీకరించింది. అయితే ఈ తేదీ మార్పుపై పక్కా వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంతకు కేసీఆర్ స్కెచ్ ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాలని, ఇదే సమయంలో ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ, కాంటూరు అంశాలపై ఇవాళ సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహారం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని 41 వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్ కు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో వారి చేతుల మీదుగానే బియ్యం సరఫరా చేస్తామని పేర్కొన్నారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కీలక ప్రకటన చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ ఓపెన్ చేయండి.

రూ. 2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను ఉపసంహరించుకుని దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇంకా ఆ నోట్లు పూర్తిస్థాయిలో తమకు చేరలేదని ఆర్బీఐ ఇవాళ వెల్లడించింది. ఇంకా పెద్ద ఎత్తున చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ. 6,181 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు పేర్కొన్నది. ఇప్పటికీ ప్రజల వద్ద ఈ నోట్లు ఉంటే వాటిని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ ఓపెన్ చేయండి.

Next Story