- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రాజకీయాల్లో 'గన్' డైలాగ్స్.. మొన్న రేవంత్ రెడ్డి, నేడు కేటీఆర్
పెన్నులే గన్నులవుతాయ్.. గోడకున్న తుపాకీ కూడా సైలెంట్.. రేవంత్ వర్సెస్ కేటీఆర్ మధ్య గన్ డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వరుస ఎలక్షన్స్ తో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రాష్ట్ర రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. వర్తమాన అంశాల్లోని తప్పొప్పులతో పాటు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, నిర్ణయాల చుట్టూ ఇరు పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల ముఖ్యనేతలు ఒకరి తర్వాత మరొకరు 'తుపాకి' అంశం చుట్టు డైలాగులు (Gun Dialogues), వదలడం ఇంట్రెస్టింగ్‍గా మారింది.
మొన్న సీఎం నేడు కేటీఆర్..:
గత వారం జరిగిన ప్రజాకవి అందెశ్రీ సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. పెన్నులపై మన్నుగప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయని సీఎం వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ పాలనలో కవులు, కళాకారులను తొక్కిపెట్టారని విమర్శిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన వారం రోజులకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నోట తుపాకీ మాట రావడం హాట్ టాపిక్‍గా మారింది. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన కేటీఆర్.. కేసీఆర్ (KCR) ఏడాదిన్నరగా బయటకు రావట్లేదని అంటున్నారని గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటుంది. కానీ బయటకు వచ్చినప్పుడు ఎలా పేలుతుందో తెలుసు అంటూ కామెంట్ చేశారు.
దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు క్యాజువల్‍గా చేసినవేనా లేక అందెశ్రీ సభలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్‍గా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తంగా పంచాయతీ ఎన్నికల వేళ ఇరు పార్టీల మధ్య తుపాకీ చుట్టూ నడుస్తున్న డైలాగ్ వార్ స్టేట్ పాలిటిక్స్ ను మరింత కాకరేపుతున్నాయి.






