Dalit Bandhu: ప్రజా భవన్ వద్ద దళిత బంధు బాధితుల ధర్నా

by Prasad Jukanti |

ప్రజా భవన్ వద్ద దళిత బంధు బాధితులు ఆందోళనకు దిగారు.

Dalit Bandhu: ప్రజా భవన్ వద్ద  దళిత బంధు బాధితుల ధర్నా
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్ లోని ప్రజా భవన్ కు పెద్ద సంఖ్యలు బాధితులు తరలి వచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజా భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. రెండో విడత దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో వెంటనే నగదు జమ చేయాలని లేకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story