- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసుపు పరిశోధనపై కొత్త అధ్యయనం మొదలుకానుంది: ధర్మపురి అరవింద్
నిజామాబాద్‌లో పసుపు బోర్డు కల అని ఆ కల సాకారమవుతున్న వేళ రైతులకు పండగని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేవలం పసుపు బోర్డు మాత్రమే కాకుండా పసుపు రైతులు నాలుగు దశాబ్దాల నుండి పోరాడుతున్న పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం ఇందూరు

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్‌లో పసుపు బోర్డు కల అని ఆ కల సాకారమవుతున్న వేళ రైతులకు పండగని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేవలం పసుపు బోర్డు మాత్రమే కాకుండా పసుపు రైతులు నాలుగు దశాబ్దాల నుండి పోరాడుతున్న పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం ఇందూరు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పసుపు బోర్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. పసుపు పరిశోధనపై కొత్త అధ్యయనం మొదలుకానుందని అన్నారు.
పండించిన ప్రతి పసుపుకొమ్ము ఎవరు కొనాలి అనేది బోర్డు బాధ్యత అని చెప్పారు. పసుపుకు మార్కెటింగ్, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ అన్నీ బోర్డు బాధ్యత అని తెలిపారు. కోతలు అవ్వగానే ఎంత విలువ కట్టాలనేది కూడా బోర్డు బాధ్యత అని చెప్పారు. పసుపుకొమ్మ క్వాలిటీ చెకింగ్ కూడా బోర్డే చూసుకుంటుందని అన్నారు. రేపటి అమిత్ షా సభను రైతులంతా కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉందని అరవింద్ భావించారు. రాష్ట్రంలో పార్టీని నడిపించేవాళ్లనే అధ్యక్షుడిని చేయాలని ఒక కార్యకర్తగా తాను కోరుకుంటున్నానని చెప్పారు.






