ధరణి అంతా తప్పులతడకలే..మేం అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం: కాంగ్రెస్

by Seetharam |   (  Updated:2023-06-07 14:55:24  IST  )

ధరణి చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

ధరణి అంతా తప్పులతడకలే..మేం అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం: కాంగ్రెస్
X

దిశ,వెబ్‌డెస్క్: ధరణి చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణిలో అన్నీ సమస్యలే ఉన్నాయనీ భూమి రికార్డుల్లో గందరగోళం నెలకొందని.. ధరణిలో మొత్తం తప్పుల తడకలేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ధరణిపై వేల సంఖ్యలో తమకు ఫిర్యాదులందాయని కాంగ్రెస్ చెబుతోంది. అయితే ఈ విషయంపై సీఎం కేసీఆర్ భగ్గుమంటున్నారు. దశాబ్దాల భూసమస్యలకు ధరణి పరిష్కారం చూపుతోందని సీఎం కేసీఆర్‌ తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ధరణి వద్దంటున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ మండిపడుతున్నారు.

Read more: ఏపీలో బీఆర్ఎస్‌కు బ్రేకులు! గులాబీ బాస్ వెనక్కి తగ్గడానికి కారణమిదేనా?

Next Story