- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Municipal Election: వారికి డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక
మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియను రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు సోమవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమయంలో పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రజా సమావేశాలు, గుమికూడడాలు పూర్తిగా నిషేధమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్‌పీ) ఇతర శాఖల సిబ్బందితో సహా 25 వేల మంది పోలీసులు ఎన్నికల విధులలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రశాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






