చైల్డ్ అబ్యూస్‌ కంటెంట్‌ చూడటం, అప్‌లోడ్ నేరం.. వందల సంఖ్యలో అరెస్టులు : డీజీపీ హెచ్చరిక

by Ramesh Naini |

చైల్డ్ అబ్యూస్‌ కంటెంట్‌పై తెలంగాణ పోలీసులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది.

చైల్డ్ అబ్యూస్‌ కంటెంట్‌ చూడటం, అప్‌లోడ్ నేరం.. వందల సంఖ్యలో అరెస్టులు : డీజీపీ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: చైల్డ్ అబ్యూస్‌ కంటెంట్‌పై తెలంగాణ పోలీసులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల భద్రతను ఆన్‌లైన్‌లో కాపాడేందుకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. TGCSBలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా కఠిమైన చర్యలు కొనసాగిస్తోందని, 2025లోనే CSEAM (Child Sexual Exploitation and Abuse Material) కేసుల్లో వందల సంఖ్యలో అరెస్టులు జరిగాయని తెలిపారు.

కంటెంట్‌ను చూడటం, అప్‌లోడ్ నేరం..

చైల్డ్ అబ్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను చూడటం, షేర్ చేయటం, నిల్వ చేయటం లేదా అప్‌లోడ్ చేయటం ఘోరమైన నేరమని డీజీపీ హెచ్చరించారు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే నేరాలపై తెలంగాణ పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఏ సమాచారం ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ట్వీట్ ఇదే..

Next Story