డిప్యూటీ సీఎంను కలిసిన డీజీపీ శివధర్ రెడ్డి

by Kema Shiva Kumar |

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను డీజీపీ శివధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

డిప్యూటీ సీఎంను కలిసిన డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను డీజీపీ శివధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 1న బాధ్యతలు చెపట్టిన శివధర్ రెడ్డి శనివారం ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీజీపీకి అభినందనలు తెలిపారు. ప్రజలకు పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉండాలని సూచించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డీజీపీ కార్యాలయంలో శివధర్ రెడ్డిని అభినందనలు తెలిపారు.

Next Story