కమాండ్ కంట్రోల్ భవనాన్ని పరిశీలించిన డీజీపీ శివధర్ రెడ్డి

by Ajay Maddhiboyina |

రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా నగరంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి) భవనాన్ని గురువారం సందర్శించారు. భవనంలోని వివిధ అంతస్తులను, కార్యాలయాలను పరిశీలించారు.

కమాండ్ కంట్రోల్ భవనాన్ని పరిశీలించిన డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ , తెలంగాణ బ్యూరో: రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా నగరంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి) భవనాన్ని గురువారం సందర్శించారు. భవనంలోని వివిధ అంతస్తులను, కార్యాలయాలను పరిశీలించారు. 4వ అంతస్తులో ఉన్న డాటా సెంటర్‌, ఇతర అధికారుల చాంబర్‌లు, 8వ అంతస్తులో గల స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, 18వ అంతస్తులో ఉన్న హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం, 19వ అంతస్తులో ఉన్న హెలిపాడ్ వంటివి పరిశీలించారు. పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ , డైరెక్టర్‌ ఐసిసిసి వి. బి. కమలాసన్ రెడ్డి, డిసిపి శ్రీమతి పుష్ప, కె. అపూర్వా రావు డిసిపి, స్పెషల్ బ్రాంచ్ తదితరులు డీజీపీ తో పాటు ఉన్నారు.

Next Story