- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోల్ కతాలో గందరగోళానికి కారణం అదే.. డీజీపీ శివధర్ రెడ్డి
కోల్ కతా స్టేడియంలో జరిగిన గందరగోళం నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి హుటాహుటిన ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత కోసం మూడు వేల మంది పోలీసులను

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా స్టేడియంలో జరిగిన గందరగోళం నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి హుటాహుటిన ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత కోసం మూడు వేల మంది పోలీసులను స్టేడియం వద్ద నియమించారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. కోల్ కతాలో రోప్ పార్టీలు లేకపోవడంతోనే ఘటన జరిగినట్టు తెలుస్తోందన్నారు. అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని ఇక్కడ అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. రాత్రి 7.15 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వస్తారని అన్నారు.
పదిహేను నిమిషాలు మ్యాచ్ ఉంటుందని అందులో చివరి 5నిమిషాలు మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ లో పాల్గొంటారని అన్నారు. కేవలం క్రీడాస్పూర్తి, ఫుట్ బాల్ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దాదాపు గంటసేపు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా మెస్సీని సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తారని.. రెండు రౌండ్ల పాటు మెస్సీ టీమ్ గ్రౌండ్ లో తిరుగుతుంటారని అన్నారు. ముందుగానే కోల్ కతాకు ఇక్కడ నుండి పోలీసులను పంపించామని అక్కడ జరిగిన గందరగోళానికి గల కారణం తెలుసుకున్నామని అన్నారు.






