- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.. ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ, అధికారులు
సెప్టెంబర్ 17 ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్ 17 ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం(Telangana Praja Palana Dinotsavam)గా ప్రకటించిన విషయం తెలిసిందే. పబ్లిక్ గార్డెన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు నిర్వహించే రిహార్సల్స్, ఏర్పాట్లను డీజీపీ జితేందర్ పరిశీలించారు. ఆయనతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, విద్యుత్ శాఖ ఎండీ ముషారఫ్ అలీ, సమాచార శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, జిల్లా కలెక్టర్ హరిచందన, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ శివలింగయ్య, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.
కాగా, సెప్టెంబర్ 17న, 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 ను ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 లో నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. మంత్రులు, ఇతర ప్రముఖులు జిల్లా కేంద్రంలో పాల్గొంటారు. అలాగే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించింది. మరోవైపు, కేంద్రలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.






