TG: పంచాయతీ ఎన్నికల వేళ పోలీసులకు DGP కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు.

TG: పంచాయతీ ఎన్నికల వేళ పోలీసులకు DGP కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్ కమిషనరేట్ మినహా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మొదలుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలను నిస్పాక్షికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story