- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ హోంగార్డ్ పాత్ర కీలకం: డీజీపీ బి.శివధర్ రెడ్డి
హోంగార్డులకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశం త్వరలో పరిష్కరించాల్సి ఉందని డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హోంగార్డులకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశం త్వరలో పరిష్కరించాల్సి ఉందని డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలిపారు. హోంగార్డులకు 63వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకను కేవలం ఒక ఉత్సవంగా కాకుండా, హోంగార్డుల సేవలను గుర్తించి, వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఉత్తేజ పూరిత కార్యక్రమంగా నిర్వహించాలని డీజీపీ అభిప్రాయపడ్డారు. డీజీపీ కార్యాలయంలో శనివారం హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. 30 సంవత్సరాలకు పైగా హోంగార్డు సేవలందిస్తున్న హోంగార్డులు, మహిళా హోంగార్డులతో కలిసి డీజీపీ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ హోంగార్డులు సేవలందిస్తున్నారని కొనియాడారు. తాను ఉద్యోగంలో చేరినప్పటి తో పోలిస్తే ప్రస్తుతం హోంగార్డుల పరిస్థితి మెరుగ్గా ఉందని, పోలీస్ శాఖకు వారు వెన్నెముక గా ఉన్నారని ప్రశంసించారు. హోంగార్డులకు లైఫ్ ఇన్సూరెన్స్ చేసేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వస్తున్నాయని, ఆయా బ్యాంకు అధికారులతో తాను ఇప్పటికే చర్చించానని పేర్కొన్నారు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకులు ఇప్పటికే విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డులకు ఎక్స్ గ్రేషియా అందజేస్తున్నాయన్నారు.
ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశాలలో శుభవార్తను హోంగార్డుల త్వరలో వింటారని ఆశిస్తున్నానని డీజీపీ తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ అడిషనల్ డిజిపి స్వాతి లక్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే హోంగార్డులకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. 15, 075 రైన్ కోట్స్, 4700 ఉలెన్ జాకెట్స్ ఇటీవల హోంగార్డులకు అందజేశామని, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామన్నారు. శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, సిఐడి అడిషనల్ డీజీపీ చారు సిన్హా, ఐజిపి లు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ ఎం. రమేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.






