తెలంగాణ విజన్-2047 పేరుతో అభివృద్ధి ప్రణాళిక

by Gantepaka Srikanth |

తెలంగాణ విజన్​2047 పేరుతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించనుంది.

తెలంగాణ విజన్-2047 పేరుతో అభివృద్ధి ప్రణాళిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విజన్​2047 పేరుతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించనుంది. స్వాత్రంత్యం వచ్చి వందేండ్లు అవుతున్న సందర్భంగా దేశాన్ని, రాష్ట్రాన్ని అగ్రభాగానా ఉంచాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం 2047 లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఒక్కో శాఖ వారిగా ప్రణాళికను తయారు చేయనున్నారు. 2047 నాటికి రాష్ట్ర జనాభా ఎంత ఉండబోతుంది, దానిలో పట్టణ, గ్రామీణ జనాభా ఎంత ఉండబోతుంది, వారి అవసరాలు, మౌలిక సదుపాయాలు, తదితర వాటిపై ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. శాఖల వారిగా ప్రణాళికను రూపొందించాలని సూచించింది. 2047 విజన్‌లో ప్రధానంగా విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయం, ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిని సారించనున్నారు.

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు దీనిపై ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కనీస వసతులు, గిరిజనులు, దళితులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ఇలా అనేక కేటగిరిలు, శాఖలు వారిగా ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న జనాభా లెక్కల ఆధారంగా 2047 నాటికి ఏ విధంగా జనాభా ఉండబోతుంది, అవసరాలు ఎంత స్థాయిలో పెరగనున్నాయి అనే అంశాలను పొందుపరుస్తారు. అయితే రాష్ట్రంలో ఈనెల 26న పథకాల ప్రారంభోత్సవం ఉండటంతో అధికారులు వాటిలో బీజిబిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమం తరువాత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లక్ష్యాలకు అనుగుణందా ప్రణాళికను రూపొందించనున్నారు.

Next Story