- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యం
దేశ అభివృద్ధి తో పాటు పట్టణ, గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యపడుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశ తాండూర్ టౌన్: దేశ అభివృద్ధి తో పాటు పట్టణ, గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యపడుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాండూర్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో రూ.10లక్షల ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనులను, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు, సమృద్ధిగా నిధులు కేటాయిస్తుందని, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరుపేద ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. గతంలో బిఆర్ఎస్, ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో కాలక్షేపం చేస్తుందని, ప్రజలకు ఓట్లు అడిగే నైతిక విలువ ఇరు పార్టీలు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రజలు జవాబుదారితనం, పారదర్శక పాలన, అవినీతి నిర్మూలనకు బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వివిధ రాజకీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం అసాధ్యమని తెలిపారు. తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో బీజేపీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలో నిల్చుంటారని, అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుపొంది తాండూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్, తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రజినీకాంత్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
READ MORE ....






