- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌తోనే పాలమూరు అభివృద్ధి: CM రేవంత్ రెడ్డి
ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌తోనే మన బతుకులు బాగుపడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌తోనే మన బతుకులు బాగుపడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మూసాపేట మండలం వేముల గ్రామంలోని ఎస్జీడీ కార్నింగ్ ఫార్మా షూటికల్ గ్లాస్ క్యూబింగ్ జాయింట్ వెంచర్ ఫర్నేష్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ బాగున్న ప్రాంతాలలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా గత పాలకుల కారణంగా ఈ రెండింటికి నోచుకోలేకపోయింది. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న నీటిని తీసుకోలేకపోయాం.. విద్యాపరంగా అభివృద్ధిని సాధించలేక ఈ ప్రాంత ప్రజలు కూలీలుగా.. వలస కూలీలుగా మారిపోయారు. ఈ ప్రాంతమంతా కరువు ప్రాంతం అయ్యింది. దేశంలో ఏ ప్రాజెక్టు, ఏ నిర్మాణాన్ని చేపట్టిన పాలమూరు ప్రజల కష్టం ఉండేది అన్నారు. దేశ విదేశాల నుండి వచ్చే బృందాలను ఈ ప్రాంతంలో ఉన్న కరువును చూపించేందుకు గత పాలకులు ఆహ్వానించారు. ఇటువంటి ఈ జిల్లా ప్రజలు కెసిఆర్ ను ఎంపీగా గెలిపిస్తే చేసింది ఏమీ లేదు అన్నారు. బూర్గుల రామకృష్ణ రావు తర్వాత 75 సంవత్సరాలకు ఈ ప్రాంత బిడ్డగా మీ అందరి సహకారంతో నేను ముఖ్యమంత్రిని అయ్యాను. మన జిల్లాను మనమే అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. పాలమూరు యూనివర్సిటీ .. పేరుకే యూనివర్సిటీ.. పరిస్థితి ఒక పీజీ కళాశాల ల ఉండేది అన్నారు. ఇప్పుడు ఇక్కడ లా, ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసి యూనివర్సిటీ కీర్తిని పెంచుతున్నాము అన్నారు. మరోవైపు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ట్రిపుల్ ఐటి నీ మంజూరు చేసుకున్నాము అని ముఖ్యమంత్రి చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు అత్యున్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి అన్నారు. ఉన్నత విద్య చదవడంతో పాటు ఎంచుకున్న వృత్తిలో నైపుణ్యాన్ని సాధించేందుకు వృత్తి నైపుణ్య కేంద్రాలను , వీలున్నచోట పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్ల నుండి నివేదికలను తెప్పించుకుంటానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మొదటి ముద్ద నా పాలమూరుకే అని అన్నారు. ఇందుకోసం సహచర మంత్రులు, తదితరులు ఏమీ అనుకున్న నేను నా జిల్లాకే ప్రాధాన్యతను ఇస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత పాలకులు ఇక్కడి కరువు పరిస్థితులను, ప్రజల దుస్థితులను చూపించేందుకు విదేశీ బృందాలను తీసుకువస్తే.. అభివృద్ధి , పరిశ్రమలు, ప్రాజెక్టులు,గొప్ప గొప్ప విద్యాసంస్థలను ఏర్పాటుచేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న జిల్లాగా చూపిద్దాము అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రాజెక్టులను అడ్డుకోవద్దు :
గత ప్రభుత్వము పాలమూరు జిల్లాలో ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడంతో పాటు నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి సాగునీటిని అందించేందుకు ముందుకు వెళుతుంటే.. కొంతమంది కేసులు వేస్తున్నారు. మరి కొంతమంది రైతులను రెచ్చగొట్టి భూ సేకరణ జరగకుండా కుట్రలు చేస్తున్నారు అని ముఖ్యమంత్రి ఆరోపించారు. మీడియా కూడ ప్రాజెక్టులకు వచ్చే ఆటంకాలను పరిశీలించి ప్రజలలో సానుకూల వైఖరి వచ్చేలా చూడాలి అన్నారు. ప్రాజెక్టుల కోసం తీసుకునే పొలాలలో ఎక్కడ 11 లక్షలకు రూపాయలకు మించి ఇచ్చిన దాఖలాలు లేవు అన్నారు. నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతలకు అడ్డుపడుతున్న రైతులను ఒప్పించే బాధ్యతలను తీసుకోవాలని మంత్రి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు.
సీఎంకు కానుకగా ఇద్దాం : దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలను గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇద్దాము అని పార్టీ నాయకులు, శ్రేణులకు దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత బిడ్డ ఉండడంవల్ల వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టకోగలుగుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఏటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20వేల కోట్ల రూపాయలను కేటాయిస్తాము అని చెప్పారు. ఆ హామీ లో భాగంగా అనేక అభివృద్ధి పనులను చేసుకోగలుగుతున్నాము అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, డిగ్రీ కళాశాలలను, కోర్టును, దేవరకద్రను మున్సిపాలిటీగా చేసుకున్నాము అన్నారు. నియోజకవర్గంలో మిస్సైల్ తయారీ కంపెనీ ఏర్పాటు కోసం సీఎం అన్ని విధాల సహకరిస్తున్నారు అన్నారు. కురుమూర్తి దేవాలయ అభివృద్ధి కోసం 110 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. పనులను పూర్తి చేసి బ్రహ్మోత్సవాల నాటికి ముఖ్యమంత్రిని ఆహ్వానించి ప్రారంభింప చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీ అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పాటు, కొత్తకోట లో డిగ్రీ కళాశాల, జాతీయ రహదారి పొడవున జరిగే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు వీలుగా మూసాపేట వద్ద రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం అన్ని విధాల ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. మన అందరం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు మెంబర్ల నుండి, జిల్లా పరిషత్ చైర్మన్ ల వరకు అన్ని స్థానాలను గెలిపించుకొని ముఖ్యమంత్రి కి కానుకగా ఇద్దాము అని ఎమ్మెల్యే జిఎంఆర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతను వహించిన ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు ఎ న్నం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, మెగా రెడ్డి, పరిణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఏనుగు నరసింహారెడ్డి, హెచ్డి టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్లు దీపక్ సర్జిత్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.






