- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay : రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ లో పుట్టిన బిడ్డగా, మానేరు నీరు తాగిన వ్యక్తిగా చెబుతున్నానని..కరీంనగర్ ను సమగ్రాభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నానని, అందుకోసం రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay)స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ లో పుట్టిన బిడ్డగా, మానేరు నీరు తాగిన వ్యక్తిగా చెబుతున్నానని..కరీంనగర్ ను సమగ్రాభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నానని, అందుకోసం రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay)స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపాల్టీలో నిరంతర మంచినీటి పథకంతో పాటు పలు అభివృద్ధి పనులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి(Union Urban Development Minister) మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar), Minister, మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి గంగుల కమలాకర్(Former Minister Gangula Kamalakar)లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి మనమంతా రాజకీయాలను, జెండా, సొంత ఎజెండాలను పక్కనపెట్టాలని కోరుతున్నానని, కాకు, పొన్నం ప్రభాకర్, గుంగల కమలాకర్ మధ్య ఎలాంటి విబేధాల్లేవన్నారు. పేదరికం నుండి హర్యానా సీఎంగా, కేంద్ర మంత్రిగా ఎదిగిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ద్వారా కరీంనగర్ లోని 4 వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటలపాటు నీళ్లందించడం గర్వకారణమన్నారు.
పట్టణ ప్రజల డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించే క్రమంలో స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే కొట్లాడి సాధించామన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాదం స్కీంలో చేరుస్తున్నామని, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ లో చేరుస్తామని వెల్లడించారు. సిరిసిల్ల, వంగర ప్రాంతాల్లో నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని,
కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణకు 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, రోడ్ల కోసమే లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేశామని బండి సంజయ్ వివరించారు. ఈ కార్యక్రమంలోకరీంనగర్ మున్సిపల్ కార్పేరేషన్ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీంద్రసింగ్, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.






