పాఠశాల విద్యాశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా దేవసేన నియామకం

by Gantepaka Srikanth |

పాఠశాల విద్యాశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా దేవసేన నియామకం

పాఠశాల విద్యాశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా దేవసేన నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా ఏ.దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కాలేజియేట్, సాంకేతిక విద్యా కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ సెలవుపై వెళ్లడంతో, పరిపాలన సాఫీగా సాగడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నవీన్ నికోలస్ సెలవులో ఉన్న కాలానికి గాను దేవసేన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story