రేవంత్ రెడ్డి గొంతులో వీరమల్లు ముల్లు దిగింది: దేశపతి శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డి గొంతులో వీర‌ముల్లు దిగింది అంటూ ప్రముఖ రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలను పెంచడానికి వీళ్లేదని రేవంత్ రెడ్డి అన్నారని హరిహరవీరమల్లు

రేవంత్ రెడ్డి గొంతులో వీరమల్లు ముల్లు దిగింది: దేశపతి శ్రీనివాస్
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి గొంతులో వీర‌ముల్లు దిగింది అంటూ ప్రముఖ రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలను పెంచడానికి వీళ్లేదని రేవంత్ రెడ్డి అన్నారని హరిహరవీరమల్లు అనగానే పెంచుకోవచ్చని ఎద్దేవా చేశారు. హరిహరవీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముల్లు దిగిందని విమర్శించారు. పవన్ కల్యాణ్ అంటే టికెట్ ధరలు పెంచుకోవచ్చని అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి నుండి మోడీ వరకు ఒకటే బంధం ఉందని వ్యాఖ్యానించారు.

తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలనేది వీళ్ల కుట్ర అని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణలో తెలుగు దేశం లేకుండా చేశాడని, అందుకే కేసీఆర్ లేకుండా చేయాలనేదే వీళ్లు కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గంలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని, నేటి వరకు 5వేల కేసులు పెట్టారని ఆరోపించారు. బనకచర్ల మీటింగ్‌కి పోనెపోను అని రేవంత్ రెడ్డి అన్నాడని, అక్కనుండి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నావు అనగానే తెల్లారేసరికి ఉరుక్కుంటూ పోయి సంతకం పెట్టి వచ్చాడని ఎద్దేవా చేశారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చి, తిరుగు వలసలు వచ్చేలాగా చేసి కేసీఆర్ అన్యాయం చేశాడు అంట.. చంద్రబాబు ఏమో న్యాయం చేసాడు అంట అని విమర్శించారు.

Next Story