హైదరాబాద్‌‌లో 179 మద్యం దుకాణాలకు దరఖాస్తులు.. ఎస్‌హెచ్‌ఓలకు డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు

by Ramesh Naini |

హైదరాబాద్‌, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని హైదరాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు.

హైదరాబాద్‌‌లో 179 మద్యం దుకాణాలకు దరఖాస్తులు.. ఎస్‌హెచ్‌ఓలకు డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు
X

దిశ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల (liquor shops) కోసం దరఖాస్తులు చేసుకునేవారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని హైదరాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి (Anil Kumar Reddy) ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశించారు. దరఖాస్తు దారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. నాంపల్లిలోని (Excise Department) అబ్కారీ భవన్‌‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలోని 11 ఎక్సైజ్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీటీఎఫ్‌టీములతో సోమవారం సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రెండేళ్లలో మద్యం సెల్స్‌ వివరాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని సూచించారు.

దరఖాస్తులు చేసుకునేవారికి దరఖాస్తుల సమూనాలో ఏ రకమైన తప్పిదాలు లేకుండా ఎక్సైజ్‌ సిబ్బంది సహకారం అందించాలన్నారు. దరఖాస్తులు నింపడం పూర్తి చేసిన అనంతరం అబ్కారీ భవన్‌లోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న కౌంటర్‌లో దాఖలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు రీసీట్‌, ఎంట్రిపాసులు అందాయా లేదా అనే విషయాన్ని కూడ పరిశీలించాలని తెలిపారు. కొత్త వారు దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చినప్పుడు వారికి తగిన సూచనలు అందించాలన్నారు. ఏ షాప్‌కి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారీగా డిస్ప్లే చేయాలని ఎక్సైజ్ సూపర్డెంట్ పంచాక్షరి సూచించారు. అప్‌టేక్‌లు, ఎన్‌డీపీఎల్‌ అమ్మకాలు జరుపుతున్న కేంద్రాలపై నిఘా పెట్టాలని, క్రైమ్‌కు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఈఎస్‌ శ్రీనివాసరావులతో పాటు 11 స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Next Story