అంగరంగ వైభవంగా డిప్యూటీ CM భట్టి కుమారుడి వివాహం

by Gantepaka Srikanth |

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో అత్యంత వైభవంగా జరిగింది.

అంగరంగ వైభవంగా డిప్యూటీ CM భట్టి కుమారుడి వివాహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ఉదయం నుంచే ప్రారంభమైన ఈ వేడుకకు దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, సినీ రంగ దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హాజరైన రాజకీయ ప్రముఖుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ ముఖ్య నేతలున్నారు. ప్రతిపక్ష నేతల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు హజరయ్యారు. బీజేపీ నేతల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయలు హాజరయ్యారు. సినీ ప్రముఖుల్లో హీరోలు చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, నటుడు తనికెళ్ల భరణి, ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ విజయమ్మలు హాజరయ్యారు. హాజరైన అతిధులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.


అభిమానుల మధ్య డిప్యూటీ సీఎం భట్టి...

రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేదిక సందడిగా మారింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పేరుపేరునా పలకరించారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, కుశల ప్రశ్నలు అడుగుతూ వారి పట్ల తనకున్న అభిమానాన్ని భట్టి విక్రమార్క చాటుకున్నారు. పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో జీఎంఆర్ ఎరీనా పరిసరాలు కోలాహలంగా మారాయి.

Next Story