- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DCM Bhatti: సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకముంది.. తప్పకుండా అడిగిన వివరాలన్నీ పంపిస్తాం
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి(Kanche Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో గల 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి(Kanche Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో గల 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటాగా స్వీకరించిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదంటూ ప్రస్తుతానికి స్టే విధించింది. మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడమంటే చిన్న విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.
తాజాగా.. సుప్రీంకోర్టు తీర్పు(Supreme Court Verdict)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని.. తప్పకుండా న్యాయమే గెలుస్తుందని అన్నారు. విద్యార్థులపై కఠినంగా వ్యవహరించవద్దని అదనపు డీజీ (ఇంటెలిజెన్స్), సైబరాబాద్ కమిషనర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.






