- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. స్కాలర్‌షిప్స్‌పై BIG అప్‌డేట్
by Gantepaka Srikanth |
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

X
దిశ, తెలంగాణ బ్యూరో: జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రజాభవన్‌లో ఆర్థికశాఖతో పాటు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 2,813 జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన రూ.161 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టుగా అధికారుల సమీక్షలో నిర్ధారించారు. ఈ మొత్తం రూ.161 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
Next Story






