విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించింది కాదు: భట్టి

by Gantepaka Srikanth |

విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించింది కాదు: భట్టి

విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించింది కాదు: భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌(Telangana Rising Global Summit 2025)లో విజన్‌-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించిందని చెప్పారు. విస్తృత సంప్రదింపులు, అభిప్రాయాల తర్వాతే రూపకల్పన జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ దిక్సూచి అని చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిదని అన్నారు. సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధిలో గ్లోబల్ సమ్మిట్ ప్రభావం ఎంతో ఉండబోతోందని అన్నారు. విజన్ డాక్యుమెంట్‌పై ఎలాంటి విమర్శలైనా స్వీకరిస్తాం.. వివరిస్తామని వెల్లడించారు. అద్భుత సమన్వయంతో డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు తెలిపారు. సోనియా పుట్టినరోజున డాక్యుమెంట్ విడుదల చేస్తున్నాం.. సుదీర్ఘ లక్ష్యాలకు విజన్ డాక్యుమెంట్ వేదిక అని భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, నటుడు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Next Story