‘దేశం గౌరవాన్ని పెంచిన వ్యక్తి అజారుద్దీన్’.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-30 11:30:01  IST  )

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘దేశం గౌరవాన్ని పెంచిన వ్యక్తి అజారుద్దీన్’.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు
X

Bhattiబీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనార్టీ నేత అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో.. ఆ రెండు పార్టీలు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపాయని విమర్శించారు. అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవద్దని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్‌ సహకరించింది.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్‌కు బీజేపీ సహకరిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు కష్టమని క్లారిటీ వచ్చాకే.. బీఆర్ఎస్‌ కుట్రపూరిత రాజకీయాలు మొదలెట్టిందని విమర్శించారు. రాష్ట్రంపై ప్రేమాభిమానం ఉన్న ఎవరూ కూడా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తామంటే అడ్డుకోరు అని అన్నారు. క్రికెట్ రంగంలో అసమాన ప్రతిభ చూపించి దేశం గౌరవాన్ని పెంచిన వ్యక్తి అజారుద్దీన్ అని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తుంటే.. మతం పేరుతో రాజకీయం చేసి.. బీఆర్ఎస్, బీజేపీలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ తమ అవసరాలకు అనుగుణంగా బీఆర్ఎస్‌ను వాడుకుంటోందని అన్నారు.

READ MORE ...

DRF, PR నిధులు వాడుకోండి.. కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

Next Story