Bhatti Vikramarka: కెప్టెన్ లేని నావ లా బీఆర్ఎస్.. డిప్యూటీ సీఎం భట్టి సెటైర్

by Prasad Jukanti |

లాండ్ లెస్ లేబర్ కు డబ్బులు ఇస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుంటోందని భట్టి విమర్శించారు.

Bhatti Vikramarka: కెప్టెన్ లేని నావ లా బీఆర్ఎస్.. డిప్యూటీ సీఎం భట్టి సెటైర్
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఖరిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శలు గుప్పించారు. కెప్టెన్ లేని నావ లా బీఆర్ఎస్ పరిస్థితి తయారైందని తుఫాన్ లో చిక్కుకున్న షిప్ లా ఎక్కడికి వెళుతుందో వారికి తెలియడంలేదని సెటైర్ వేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మాట్లాడిన భట్టి విక్రమార్క.. నాయకుడు లేకపోతే ఇలాగే ఉంటుంది.. సభలో స్పష్టంగా తెలుస్తోందన్నారు. సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ కు లేదన్నారు. ప్రతిపక్షం ఇలా ఉండకూడదన్నారు. మిగతా అంశాలు చర్చకు రాకూడదన్నది బీఆర్ఎస్ లక్ష్యం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను మిస్ గైడ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూమి లేని కూలీలకు డబ్బులు ఇస్తామంటే బీఆర్ఎస్ (BRS) వద్దంటుందని రైతులకు మేలు జరగడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. ప్రివిలేజ్ మోషన్ ఎందుకు పెట్టారో వారికే అర్థం కావడం లేదని మండిపడ్డారు.

Next Story