Bhatti Vikramarka: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా సాధనలో రాజీపడబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.

Bhatti Vikramarka: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Krishna, Godavari waters) కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా సాధనలో రాజీపడబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ఖమ్మం జిల్లాలో (Independence Day) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత పాలకు నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. కృష్ణా, గోదావరి జలాల్లో శాశ్వత హక్కుల వాటా విషయంలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహత్మక ప్రణాళికతో పనిచేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకుల పాపాలు శాపాలుగా వెంటాడుతున్నాయని, అయినా కూడా రైతుల సంక్షేమంపై రాజీపడేదిలేదని అన్నారు. చివరి ఆయా కట్ట వరకు నీరు ఇచ్చే విధంగా తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

అలాగే 2047 నాటికి భారత్ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుందని అన్నారు. ఇక, తెలంగాణలో రూ.13 వేల కోట్ల వ్యయంతో పేదలకు సన్నబియ్యం అందించామని అన్నారు. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్‌ బ్రాండ్‌ స్కీమ్‌ అని, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పుకొచ్చారు.

Next Story