- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమాజానికి ఆదర్శంగా నిలవాలి : గ్రూప్-1 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన స్థితి నుంచి వచ్చి ఈ ఘన విజయం సాధించిన మీరు, భవిష్యత్తులో ప్రజాసేవలో ముందుండి వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలని భట్టి విక్రమార్క కోరారు. పోటీతో కూడిన ఈ కాలంలో గ్రూప్-1 విజయం మీ కష్టానికి, ప్రతిభకు నిదర్శనం అని తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన స్థితి నుంచి వచ్చి గ్రూప్-1 వంటి అత్యున్నత లక్ష్యాలను సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సోమవారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది, గ్రూప్-1 సాధించి ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మెమంటోలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన స్థితి నుంచి వచ్చి ఈ ఘన విజయం సాధించిన మీరు, భవిష్యత్తులో ప్రజాసేవలో ముందుండి వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలని భట్టి విక్రమార్క కోరారు. పోటీతో కూడిన ఈ కాలంలో గ్రూప్-1 విజయం మీ కష్టానికి, ప్రతిభకు నిదర్శనం అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో మౌలిక వసతులను మెరుగుపరిచాం.. మరింత అభివృద్ధి కోసం తగిన నిర్ణయాలు తీసుకుంటూ, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ సమీపంలో నిరంతర విద్యా సదుపాయాలు (Continuous Learning Facilities) కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. వెనుకబడిన వర్గాల అభ్యర్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, వారి భవిష్యత్తు కార్యాచరణకు శుభాకాంక్షలు తెలిపారు.






