జూబ్లీహిల్స్‌లో డిప్యూటీ CM భట్టి సుడిగాలి పర్యటన

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని మోతీ నగర్ లో మంత్రి జూపల్లి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

జూబ్లీహిల్స్‌లో డిప్యూటీ CM భట్టి సుడిగాలి పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని మోతీ నగర్ లో మంత్రి జూపల్లి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం స్థానిక డివిజన్లో పరిస్థితిని మంత్రి జూపల్లి తో ప్రత్యేకంగా భేటీ అయి సమన్వయం చేశారు. ఆ తర్వాత యూసఫ్ గూడ డివిజన్ కు చేరుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రచారం నిర్వహించారు, అనంతరం స్థానిక నేతలతో మంత్రి పొన్నంతో కలిసి భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వెంగళరావు డివిజన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితో భేటీ అయ్యారు. ఆ తర్వాత రహమత్ నగర్ డివిజన్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో, బోరబండ డివిజన్ లో మంత్రి సీతక్కతో సమీక్ష నిర్వహించారు. యూసఫ్ గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు అందరితో, పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించి, పకడ్బందీగా పోలింగ్ చేయించుకొని పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు అవసరమైన చర్యలకు సంబంధించి యూసుఫ్ గూడా కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మోతినగర్ వీధుల్లో తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించారు. ప్రజలతో మాట్లాడుతూ మీరు వేసే ఓటుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన చెప్పారు. మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం చూపిస్తామన్నారు. తాము వేసే ప్రతి అడుగు భావితరాల భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి కోసమేనని భట్టి విక్రమార్క చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని భట్టి విక్రమార్క అన్నారు. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ... స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క పిలునిచ్చారు.

Next Story