- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు: అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
తెలంగాణ రైజింగ్‌తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైజింగ్‌తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన (Praja Palana) విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రజా పాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం ఎలా సాధించాం, కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం, భవిష్యత్తు లో తెలంగాణ రాష్ట్రం ఏం సాధించబోతుంది అనే విషయాలను ప్రపంచానికి వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. పెద్ద ఎత్తున MOU లు జరిగేలా వాతావరణం ఉండాలని సూచించారు. దుబాయ్ ఫెస్టివల్ పూర్తిగా దుబాయ్ పట్టణానికి దూరంగా జరుగుతుంది, అదే పద్ధతిలో మన రాష్ట్రంలోనూ ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు.
సీనియర్, జూనియర్ అధికారులతో కలిపి కమిటీలు వేయాలని ప్రణాళిక ప్రకారం పనులు విభజించుకుని నాణ్యతతో సకాలంలో అనుకున్న ప్రణాళికను అమలు చేసేలా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, మూసీ పునర్జీవనం, ఫ్యూచర్ సిటీ, ఇప్పటికే అనేక పరిశ్రమలను తెలంగాణ ఆకర్షిస్తోంది, భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించే విధంగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు, స్పెషల్ సి ఎస్ జయేశ్ రంజన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వివిధ విభాగాల కార్యదర్శులు, సమాచార పౌర సంబంధాల కమిషనర్ CH. ప్రియాంక, సీనియర్ IAS అధికారులు పాల్గొన్నారు.






