Cast Census: కులగణన సర్వే కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా? డిప్యూటీ సీఎం భట్టి

by Ramesh Naini |

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో కులగణనపై చర్చలు జరుగుతున్నాయి.

Cast Census: కులగణన సర్వే కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా? డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో కులగణనపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో కులగణన అంశాలపై (Bhatti Vikramarka) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. (caste census expenditure) కులగణణ సర్వే ఖర్చులో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు రూ. 10 వేలు, సూపర్‌వైజర్‌కు రూ. 12 వేలు, మండల్ నోడల్ ఆఫీసర్‌కు రూ. 15 వేలు గౌరవ వేతనంగా ఇచ్చినట్లు తెలిపారు. మొత్తానికి కలిపి కులగణన సర్వేకు ఖర్చు రూ. 160 కోట్లు అయినట్లు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఒక సామాజిక బాధ్యతతో ప్రభుత్వ నిధులు కూడా ప్రజల డబ్బులే కాబట్టి జాగ్రత్తగా ఖర్చుపెట్టి కులగణన సర్వే చాలా సైంటిఫిక్‌గా చేసినట్లు తెలిపారు.

ఇక, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), శాసనమండలిలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. 4 ఫిబ్రవరి 2024 కులగణనకు నిర్ణయం జరిగి 4 ఫిబ్రవరి 2025 సరిగ్గా సంవత్సరం లోపు ఈ నిర్ణయం నివేదికగా మారి సభ ముందుకు వచ్చిందని ఇది ఓ చారిత్రాత్మక సందర్భం అని అన్నారు. సమగ్ర ఇంటింటి కుల సర్వే నిర్వహించాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయించామని సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలతో పాటు కర్ణాటక, బీహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అన్ని విధానాల రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగించబోతున్నదని స్పష్టం చేశారు.

మొత్తం సామాజిక వర్గాలు జనాభా

ఎస్సీ 17.43% - 61,84,319

ఎస్టీ 10.45% - 37,05,929

బీసీ 46.25% - 1,64,09,179

బీసీ ముస్లిం 10.08% -35,76,588

ఓసీ ముస్లిం 2.48

మొత్తం ముస్లిం ఓసీ 12.56%

ఓసీ 13.31 % జనాభా

Next Story