- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్రలో ఎన్నడూ లేని అఖండ విజయం.. మున్సిపల్ ఫలితాలపై డిప్యూటీ సీఎం రియాక్ట్
విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు వంటి కీలక రంగాల్లో సాధికారత లక్ష్యంగా గత రెండేళ్లుగా ప్రజా ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని, ఈ గెలుపు ఆ కృషికి లభించిన గౌరవమని డిప్యూటీ సీఎం భట్టిక్రమార్క అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టిన తీర్పని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు అది ఆదరణగా మారుతుందని ప్రజలు మరోసారి నిరూపించారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు వంటి కీలక రంగాల్లో సాధికారత లక్ష్యంగా గత రెండేళ్లుగా ప్రజా ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని, ఈ గెలుపు ఆ కృషికి లభించిన గౌరవమని పేర్కొన్నారు. నిష్కల్మష నాయకత్వం, పారదర్శక పరిపాలన, సమష్టి కృషి ఇవే ఈ విజయానికి పునాదులని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలతో పాటు మంత్రివర్గం మొత్తం కలిసికట్టుగా అభివృద్ధి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లిందని వివరించారు.
మరింత బాధ్యతగా..
కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని, ప్రజలు అభివృద్ధికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం వ్యక్తమైన ఈ ఆదరణ రానున్న మార్పుకు సంకేతమని అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అభిమానాన్ని వమ్ము కానివ్వకుండా మరింత బాధ్యతతో, మరింత కట్టుబాటుతో పనిచేస్తామని ప్రకటనలో తెలిపారు. అలాగే మధిర నియోజకవర్గం నాకు రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు.. నా ప్రాణం.. అంటూ పేర్కొన్నారు. మధిర ప్రజలు చూపించిన అపారమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో 22 స్థానాల్లో 21 స్థానాల్లో అఖండ విజయాన్ని అందించింది. ఇది కేవలం విజయం కాదు… మీ ఆశీర్వాదం, మీ ఆప్యాయతకు నిదర్శనం.. అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
మీ రుణం తీర్చుకోవడమే నా ఏకైక లక్ష్యం
నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన మీ అందరి రుణం తీర్చుకోవడమే నా ఏకైక లక్ష్యం అని ఆవేదన చెందారు. మధిర కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తూ, మరో 50 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన పట్టణాన్ని నిర్మించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. మధిర అభివృద్ధే నా ఆలోచన, నా విజన్.. సుందరీకరణ, ఆధునిక మౌలిక వసతులు, సమగ్ర ప్రణాళికలతో పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తాం.. అభివృద్ధి పథంలో మధిర సరికొత్త చరిత్రను లిఖించబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.






