- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక హామీ
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఆదివారం ఉదయం హైదరాబాదులోని ప్రజాభవన్ లో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు వారి సమస్యలపై డిప్యూటీ సీఎంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు విద్యుత్ డిస్కములను ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారం జరుగుతుందని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాలని, అసత్య ప్రచారాలను ఖండించాలని సూచించారు. ఇంధన శాఖ దీర్ఘకాలం కొనసాగాలని అందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రజా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. విద్యుత్ సంస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగుల జేఏసీ, అధికారులపై ఉందని తెలిపారు.
డయల్ 1912 కు వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కారం చేసి మెరుగైన సేవలకు విద్యుత్ సంస్థలు చిరునామాగా నిలవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు ఇతర అంశాలు విని పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల ఒక గంట పాటు సమయం ఇచ్చేలా విద్యుత్ సంస్థల ఉన్నత అధికారులను ఆదేశిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. మూడో డిస్కం ఏర్పాటు ఉద్యోగుల సర్దుబాటు, 2026 పీఆర్సీ, 2004 వరకు నియామకమైన వారికి పాత పెన్షన్స్ స్కీమ్ అమలు, రెగ్యులర్ ప్రమోషన్స్, రిక్రూట్మెంట్స్, ఆర్టిజన్ సమస్యలపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిప్యూటీ సీఎంకు వినతి పత్రాన్ని సమర్పించింది. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్ రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, సదానందం, స్వామి, రమేష్, అశోక్, సుధాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, దయానంద్, శివశంకర్, జనప్రియ, మల్లయ్య, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.






