- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భట్టి విక్రమార్క భేటీ.. ఎందుకంటే?
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా ఆహ్వానించారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన భేటీలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎం హేమంత్ సోరెన్‌కి అందజేశారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఈ దిశగా అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణను నిర్వచించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధమైందని ఉప ముఖ్యమంత్రి వివరించారు.
నీతి ఆయోగ్ సలహాలు, నిపుణుల మేథోమథనం, పలు కార్యాచరణ రంగాల సమగ్ర విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.






