- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 రోజుల్లో పెన్షనర్ల బకాయిలు: డిప్యూటీ సీఎం భట్టి హామీ
రెవెన్యూ శాఖ అత్యవసర, ఆదాయ వనరు ఆర్జించే శాఖ పరిధిలోకి వస్తుందని, రెవెన్యూ ఉద్యోగుల బదిలీల నిషేధాన్ని విధించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖ అత్యవసర, ఆదాయ వనరు ఆర్జించే శాఖ పరిధిలోకి వస్తుందని, రెవెన్యూ ఉద్యోగుల బదిలీల నిషేధాన్ని విధించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కోరారు. రెవెన్యూ ఉద్యోగుల ఎన్నికల గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని, టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ సేవలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రెసా ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్ లతో కూడిన ప్రతినిధి బృందం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని తొమ్మిది శాశ్వత సంఘాల ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయు పెన్షనర్ల సమస్యలపై భట్టి ఉద్యోగ సంఘాల నేతలతో ప్రజాభవన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లించాలని, సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని కోరారు. ఈహెచ్ఎస్ ను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఒకేసారి విడుదల చేయాలని కోరారు.
ప్రభుత్వ బాధ్యత..
గత ఏడాది సెప్టెంబరులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియమించినప్పటికీ ఇంత వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. తమ జీవితమంతా ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్ల బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, 100 రోజుల్లో వారి పూర్తి బకాయిలు చెల్లిస్తామన్నారు. వెంటనే పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తామన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం జూన్ 2 వ తేదీ నుంచి అమలులోకి వస్తుందన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తామన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సమస్యలన్నిటిపై సీఎంతో చర్చించి మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో, టీజీవో, సెక్రటేరియట్ అసోసియేషన్(టీజీఎస్ఏ), పీఆర్డీయూ టీఎస్, ఎన్టీయూ టీఎస్,క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, టీఎస్ యూటీఎఫ్, టీఆర్డీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.






