Deputy CM Bhatti : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఏఐసీసీ కీలక బాధ్యతలు

by Ramesh Naini |

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది.

Deputy CM Bhatti : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఏఐసీసీ కీలక బాధ్యతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)కు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. (Maharashtra, Jharkhand) మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి (AICC General Secretary KC Venugopal) ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మహారాష్ట్ర, జార్ఖండ్‌‌కు ముగ్గరు చోప్పున సీనియర్ నేతల జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జార్ఖండ్ పరిశీలకుడిగా కీలక బాధ్యతలు అప్పగించింది.

జార్ఖండ్ లో రేపు ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే పరిణామాలను భట్టి విక్రమార్క సమన్వయం చేయనున్నారు. కాగా, జార్ఖండ్‌ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story