- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికులకు గుడ్‌న్యూస్.. సొంత ఇంటి కల సాకారం చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అధికారులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అధికారులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ, సింగరేణి ఉద్యోగుల మారుపేరు విషయానికి సంబంధించి తొందరగా పరిష్కారం చేస్తామని, మెడికల్ ఇన్ వాల్యుయేషన్ వారికి జబ్బులకు సంబంధించి బోర్డు ఉన్న అన్ని విధాల పరిష్కారం చేస్తుందన్నారు. కోల్ ఇండియా నిబంధన మేరకు సింగరేణిలో అధికారుల సంబంధించిన అన్ని సౌకర్యాలను భరిస్తుంది.. అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా అన్ని సౌకర్యాలు (టాక్స్) కల్పించడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. కార్మికులు, ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వ ఐఫోర్ కమిటీ నిర్ణయించిందని, సింగరేణి ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని రీతిలో 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఈ బీమా పథకం దేశవ్యాప్తంగా ఒక నమూనా పథకంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
అక్కడ పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కోసం రూ. 40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేయడం జరిగిందని తెలిపారు. కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2,539 పోస్టులను భర్తీ చేసినట్లు, వీటిలో 798 ఎక్స్ టర్నల్ పోస్టులు ఉండగా 1,741 కారుణ్య నియామక ఉద్యోగాలను ఇచ్చామన్నారు. క్యాథ్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 2024-25 లో సింగరేణి చరిత్రలో అత్యధిక లాభాలు రూ. 6,394 కోట్లు సాధించామని, అత్యధికంగా 34 శాతం లాభాల వాటా కింద రూ. 802 కోట్లు కార్మికులకు చెల్లించడం జరిగింది. పొరుగు సేవల సిబ్బందికి రూ.5,500 చొప్పున లాభాల వాటా చెల్లించామని తెలిపారు.






