సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి కేవలం బొగ్గు గనులకు పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనేలా నిర్ణయం తీసుకున్నాం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆత్మ అని, ఈ సంస్థ కేవలం ఉపాధికే పరిమితం కాకుండా స్థానికులకు ఒక నమ్మకం కలిగిస్తోందన్నారు. సింగరేణికి అదనంగా రావాల్సిన బొగ్గు బ్లాకులు దక్కకపోవడం, కొత్త బ్లాకులు కేటాయించక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. కర్ణాటకలోని రాయచూర్, దేవదుర్గ్ బెల్ట్‌లో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణలో సింగరేణి పాల్గొందన్నారు.

మన రాష్ట్రంలో మరో 25 ఏళ్లకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని, సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోతే బొగ్గు బ్లాక్‌లు ప్రైవేటు వ్యక్తులకు వెళ్తాయన్నారు. సత్తుపల్లి, కోయగూడెం బ్లాక్‌లు ఇప్పటికే ప్రవేటు వ్యక్తులకు వెళ్లాయని అన్నారు. కీలక ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు గ్రీన్ ఎనర్జీలో కూడా ఈ సంస్థ ప్రవేశించిందని, పలు రాష్ట్రాల్లోని ఎన్టీపీసీలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోందన్నారు.

Next Story