- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీఎస్టీ ఎగవేతదారులపై కఠిన చర్యలు.. ఏఐ టెక్నాలజీ వాడండి.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ యంత్రాంగం కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ (Commercial Tax Department) యంత్రాంగం కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇకనుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రగతి పై సమీక్ష నిర్వహిస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. (GST) జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ ద్వారా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జీఎస్టీ ఎగవేత దారుల పైన కఠినంగా వ్యవహరించాలని, అదేవిధంగా నిఘా వ్యవస్థ నిరంతరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా రాష్ట్ర ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉందని అన్నారు.
ఉన్నత స్థాయి అధికారులు నిత్యం ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని పర్యవేక్షణ సాగించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లావాదేవీలు పన్నుల వసూలులో వస్తున్న సమస్యలను అధిగమించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కమర్షియల్ ట్యాక్స్ శాఖలోని ఎన్ ఫోర్స్మెంట్, ఆడిట్ తదితర విభాగాల్లో సాధించిన ప్రగతిని సమీక్షించారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో అంతర్గతంగా కమిటీలు వేసి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏ రిజ్వీ, కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరి కిరణ్, డిప్యూటీ కమిషనర్లు సౌజన్య, వాసవి, సంయుక్తారాణి, సునీత, గీత తదితరులు పాల్గొన్నారు.






