- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Job Calendar : జాబ్ క్యాలెండర్‌పై మరోసారి డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర శాసనసభలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను జాబ్ క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ల సమయంలోనే ఉద్యోగాల సంఖ్యను వెల్లడిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విపక్ష సభ్యులకు వివరించారు. తాజాగా మరోసారి జాబ్ క్యాలెండర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు మాట్లాడారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన పిప్పిరిలో రూ. 20.50 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
నా పాదయాత్రలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే అసెంబ్లీ వేదిక సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించామన్నారు భట్టీ. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పాం.. చెప్పినట్లుగానే ప్రక్షాళన చేసి గ్రూప్-1 పరీక్షలను లీక్ కాకుండా సమర్థవంతంగా నిర్వహించామన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ ప్రక్రియను మొదలు పెట్టామన్నారు.
గ్రూప్-1, 2, 3 అలాగే విద్యుత్, సింగరేణి ఇతర శాఖల ఉద్యోగాల భర్తీ చేయడానికి నిర్వహించే పరీక్షలకు సంబంధించి.. సంవత్సరం మొత్తం ఏ తేదీ నాడు ఏ పరీక్ష జరుగుతాయో.. ఏ తేదీ నాడు ఏ నోటిఫికేషన్ వస్తాయో.. స్పష్టంగా ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్‌ను ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రకటించాం.. ఇది యువత కోసం చేసిన కార్యక్రమం.. అని మరోసారి జాబ్ క్యాలెండర్ పై మాట్లాడారు. కాగా, జాబ్ క్యాలెండర్‌పై బీఆర్ఎస్ శ్రేణులు అరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగాల సంఖ్య తెలుపకుండా కేవలం తేదీతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.