Deputy CM Bhatti: ఆ ఒక్కటి లేకపోతే భారత్ ప్రపంచాన్ని ఏనాడో జయించేది.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాజ్యాంగం సకల సమస్యలకు పరిష్కారమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Malli Bhatti Vikramarka) అన్నారు.

Deputy CM Bhatti: ఆ ఒక్కటి లేకపోతే భారత్ ప్రపంచాన్ని ఏనాడో జయించేది.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యాంగం సకల సమస్యలకు పరిష్కారమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Malli Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally) జేఎన్‌టీయూ (JNTU)లో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతో ఇబ్బందులను అధిగమించవచ్చనే విషయాన్ని బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) పూర్తిగా నమ్మారని తెలిపారు. అందుకే దేశం వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాను ఆయన స్థాపించారని గుర్తు చేశారు. సమసమాజ స్థాపనకు యువత మేధస్సు ఉపయోగపడాలనేది తన ఆకాంక్ష అని అన్నారు.

రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం చూపుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే సంవిధాన్ సమ్మాన్ బచావ్ సమ్మేళన్ (Samvidhan Samman Bachav Sammelan) కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. సమాజ పరివర్తన, సమస్యలకు పరిష్కాం చూపేది రాజ్యాంగమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. భారతదేశంలో మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయని ప్రపంచాన్ని జయించే శక్తి, మేధస్సు మనలో ఉందని తెలిపారు. జాతుల మధ్య పోరాటాలతోనే ఆ శక్తి మొత్తం నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. అసమానతలు లేకుండా ఉంటే భారత్ ఎన్నడో ప్రపంచాన్ని జయించేదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Next Story