- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ సమ్మిట్.. గవర్నర్‌ను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా జరగనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా జరగనుంది. ఆరు ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు సమ్మిట్‌కు జరుకావాల్సిందిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి శనివారం మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్ దిశను సూచించే కీలక కార్యక్రమానికి గవర్నర్ హాజరు కావడం రాష్ట్రానికి ప్రేరణ కలిగిస్తుందని భట్టి పేర్కొన్నారు. ఈ భేటీలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు కూడా పాల్గొన్నారు. సమ్మిట్‌లో నీతిఆయోగ్, ఐఎస్బీ సూచనలతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. అలాగే 8న మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ప్రసంగం ఇవ్వనున్నారు. 9న సాయంత్రం 6 గంటలకు సదస్సు ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తెలిపారు.






